నెల్లూరు: మర్రిపాడు మండలం రామానాయుడు పల్లి పంచాయతీ కార్యాలయానికి నెల రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య ఉపకేంద్ర సిబ్బంది విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చే విద్యుత్ మరమ్మత్తులకు గురి కావడంతో ఈ సమస్య ఏర్పడింది.