NRML: నిర్మల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన నరసయ్య లక్ష్మి దంపతులకు చెందిన కుమార్తె అనూష ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో కేజీబీవీలో బైపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకును సాధించింది. ఇంటర్మీడియట్ కేజీబీవీ నర్సపూర్ (జి)లో చదివింది. తండ్రి వ్యవసాయం, తల్లి బీడీలు చుడుతూ కష్టపడి చదివించిందని వారి కష్టాన్ని వృధా చేయనని విద్యార్థి బుధవారం తెలిపింది.