బాపట్ల: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలోనే దారుణంగా హత్యకు గురైన వీరయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని గుర్తుచేశారు. ఈ ఘటన వెనక ఉన్న దుండగులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య కుటుంబానికి పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు.