HNK: రాబోయే అన్ని ఎన్నికల్లో BRS విజయ దుందుభి మోగిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 3వ డివిజన్ ఆరేపల్లికి చెందిన పలువురు నేతలు, యువత బుధవారం మాజీ మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యకర్తలు సమన్వయంతో పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేయాలని సూచించారు. BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు