MNCL: కన్నెపల్లి మండలంలోని ప్రజలు వేరే ఊరికి వెళ్తున్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై గంగారాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగారం, నగదు బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలన్నారు. బీరువా తాళాలు తమ వెంట తీసుకుని వెళ్ళాలని, యాత్రలకు వెళుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పేర్కొన్నారు.