HNK: ఉగ్రదాడుల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న పర్యటకుల మరణం పట్ల బుధవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలను ఆదుకొని అండగా నిలవాలని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ కావ్య కోరారు.