»Vijay Sethupathi Comments On Political Entry 70th Stalin Birth Anniversary
Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై విజయ్ సేతుపతి కీలక వ్యాఖ్యలు
ప్రముఖ తమిళ్ హీరో విజయ్ సేతుపతి(vijay sethupathi) పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంకే స్టాలిన్(mk stalin) 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజా జీవితాన్ని స్మరించుకునే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన క్రమంలో సేతుపతి మాట్లాడారు. ఆ క్రమంలో తనకు రాజకీయాల గురించి మొత్తం తెలుసని..యువత కూడా తెలుసుకోవాలని అన్నారు.
ప్రముఖ తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(vijay sethupathi) రాజకీయాల్లోకి వస్తున్నారా? అంటే ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. అయితే తనకు రాజకీయాల గురించి చాలా తెలుసని అన్నారు. కానీ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. మరోవైపు ఫ్యూచర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు యువత కూడా రాజకీయాల గురించి తెలుసుకోవాలని సూచించారు. అయితే సేతుపతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు సేతుపతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా లేదా అని అతని అభిమానులతోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా చర్చించుకుంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫోటో ఎగ్జిబిషన్లో పాల్గొన్న క్రమంలో సేతుపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(mk stalin) ప్రజా జీవితాన్ని స్మరించుకునే ఈ ఎగ్జిబిషన్ స్టాలిన్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని మధురై (తమిళనాడు)లోని మెనెంతల్లో ప్రారంభించారు. విగ్రహాలు, నమూనాలతో వాస్తవికంగా చిత్రీకరించబడిన ఎగ్జిబిషన్లో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రయాణాలకు సంబంధించిన అరుదైన ఛాయాచిత్రాలు ప్రదర్శించారు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఎగ్జిబిషన్ మొత్తం చూసిన తర్వాత వారసత్వ రాజకీయాల ద్వారా సీఎం స్టాలిన్ అధికారంలోకి వచ్చారన్న వాదనలన్నీ అవాస్తవమని సేతుపతి అన్నారు. స్టాలిన్ ఎంతో కష్టపడి పైస్థాయికి వచ్చారని, ఆయన అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు.
అనంతరం చెన్నై(chennai)లోని రోహిణి థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చిన గిరిజనులను సిబ్బంది అనుమతించకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. మొత్తం ఘటనను సేతుపతి తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన అణచివేత పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు. మానవులందరూ సమానంగా జీవించడం కోసం భూమి సృష్టించబడిందని చెప్పారు. మరొక వ్యక్తిని అణచివేసే వ్యక్తికి మనం అండగా నిలబడాలని ఆయన తెలిపారు.