విశాఖలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు జగదాంబ సమీప నివాసి ఎం. శ్రీధర్ (36)గా గుర్తించారు. ఆయన కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య మృతదేహం కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.