HNK: పరకాల RTC డిపో నుంచి దమనపేట, రాయపల్లి, కనపర్తి, నాగుర్లపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు, విద్య, వైద్యం కోసం పట్టణ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చినా ఆటోలు, లిఫ్ట్లు లేదా కాలినడకనే ప్రయాణించాల్సి వస్తోంది. స్థానిక MLA, అధికారులు స్పందించి తక్షణమే ఈ రూట్లో బస్సు సేవలు ప్రారంభించాలని కోరారు.