SRCL: వేములవాడ పట్టణంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. బద్ది పోచమ్మ వీధి, అర్బన్ కాలనీ, సుభాష్ నగర్, ధోబి ఘాట్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కుక్కలు దాడి చేయడంతో 20 మందికిపైగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో స్థానికులతో పాటు, భక్తులు ఉన్నారు.