ASF: కాగజ్‌నగర్‌లోని సెయింట్ క్లారిటీ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్కూల్ ఫీజులు చెల్లించలేదన్న కారణంగా కొందరు విద్యార్థులను తరగతులకు అనుమతించకుండా బయట నిలబెట్టడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఫీజులు ఆలస్యమవ్వడం వల్ల విద్యార్థులను బయట నిలబెట్టడమేంటని వారు ప్రశ్నించారు.