NZB: అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు.