SRPT: మాదక ద్రవ్యాలు వాడటం ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. డ్రగ్స్ వద్దు ప్రాణం ముద్దు అని నినాదంతో ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ సంతలో కరపత్రాలు పంచి పుర్రె ఎముకలు గూడు చిత్రాలు కలిగిన నల్లని దుస్తులను ధరించి మైక్ పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించారు.