సత్యసాయి: రామగిరి ఎంపీపీ ఎన్నికలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఎంపీటీసీలు ప్రకటించారు. తమను ప్రలోభ పెట్టేందుకు కూటమి నేతలు అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదుగురు ఎంపీటీసీలు ఈ ఎన్నికను బహిష్కరించడంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం నిరవధిక వాయిదా వేసింది.