ELR: జిల్లాలో నిర్వహించవలసిన సాంఘిక శాస్త్రం 10వ తరగతి పబ్లిక్ పరీక్షపై పలు అపోహలు వీడాలని డీఈఓ వెంకటలక్ష్మమ్మ గురువారం అన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. రంజాన్ సెలవు మార్చి 31న ప్రభుత్వం ప్రకటిస్తే.. ఏప్రిల్ ఒకటిన షోషల్ పరీక్ష ఉంటుందన్నారు. ఒకవేళ ఏప్రిల్ 1న రంజాన్ సెలవు ప్రకటిస్తే.. మార్చి 31న సోషల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు.