గుంటూరు: ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుతూ వైద్య మిత్రులు, ఆరోగ్య మిత్రులు గురువారం మంగళగిరిలోని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలియజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగిస్తారన్న ఆందోళన వైద్య మిత్రుల్లో ఉందని ఆయన తెలిపారు.