NDL: జిల్లాలోని మినరల్ వాటర్ ప్లాంట్‌లోని నీటిలో పలు సమస్యలు ఉన్నాయని అధికారులు గురువారం పట్టణంలోని 3వాటర్ ప్లాంట్స్‌ను సీజ్ చేశారు. వాటర్ ప్లాంట్స్‌లో నీటి పరీక్షలు చేయడంతో ఎన్జీవో కాలనీ, సరస్వతీనగర్, సంజీవ నగర్ ప్రాంతాల్లో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్‌లో నీళ్లు కలుషితంగా ఉన్నాయని రిపోర్టులో తేలాయి. ఉన్నతాధికారులు అదేశాల మేరకు ప్లాంట్లను సీజ్ చేశామని అన్నారు.