KDP: జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్, జమ్మలమడుగు రూరల్ పరిధిలోని తలమంచి పట్నం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించి, స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన విచారించి పరిష్కరించాలని సీఐ, డీఎస్పీలకు తెలిపారు.