ASR: గంజాయి సాగు చేయడం రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని, గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే శిక్షార్హులు అవుతారని చింతపల్లి ఏవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం కొత్తఊరు గ్రామంలో ఆయన గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. గిరిజన రైతులు గంజాయి సాగుకు దూరంగా ఉండాలని, సాంప్రదాయ పంటలు పండించాలని సూచించారు.