WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు కొంత ఊరటనిచ్చాయి. గత మూడు రోజులతో పోలిస్తే, ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా ధర రూ. 7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 గా ఉండగా, ఈరోజు రూ. 7,050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు.