ELR: వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలులోని ఆయన నివాసంలో చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషన్ రాజు పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.