NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో నేడు బుధవారం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించనున్నారు. తలకొండపల్లి మండలంలోని రామకృష్ణాపురం, దేవుని పడకల్ గ్రామాల్లో సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రభలు తిప్పుట కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు డోకూర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.