ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని కోరుతూ వెలిగండ్ల బస్టాండ్ సెంటర్లో సీపీఎం పార్టీ నాయకులు రాయల్ల మాలకొండయ్య శనివారం కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే మండలంలో 17,600 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వలసలు, కరువును రూపుమాపాలంటే ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.