కృష్ణా: నూజివీడు పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రోడ్లను ఊడ్చి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.నరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిసరాలను పరిశుభ్రతే లక్ష్యం అన్నారు.