AP: హక్కులు అడిగే వాళ్లు బాధ్యతగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. గత సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా అని ప్రశ్నించారు. గత సీఎం పరదాలు కట్టుకుని వచ్చేవారని, విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటూ వచ్చే వాళ్లని ఆరోపించారు. ప్రజల సమస్యలు వినేందుకు కనీసం మాట్లాడనిచ్చేవారు కాదన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం.. సమస్యలు వినేందుకు వచ్చానని పేర్కొన్నారు.