ADB: జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఉజ్వల భారతదేశం కోసం ప్రధానమంత్రి పాఠశాలలు కార్యక్రమంలో భాగంగా అధికారులు విద్యార్థుల కోసం క్షేత్ర పర్యటనలు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఇవాళ గుడిహత్నూర్ ప్రభుత్వ మోడల్ స్కూల్, ఉన్నత పాఠశాల, యాపాల్ గూడ విద్యార్థులు ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన నర్సరీని సందర్శించారు.