NLG: పెద్దవూర మండలం వెల్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆడెపు వర్షిత, ఈనెల 9న నాగార్జునసాగర్ బీసీ గురుకులంలో జరిగిన సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కయ్యారు. ఈనెల 20 నుంచి 23 వరకు వికారాబాద్ జరుగు పోటీలలో జిల్లా తరపున పాల్గొననున్నట్లు ఇవాళ పాఠశాల PD లెనిన్ తెలిపారు.