HYD: సర్వేను సరిగ్గా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన ఎలా అందిస్తుందని ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్ ప్రశ్నించారు. గురువారం బీఆర్ఎస్ భవన్లో ఆయన సమావేశమయ్యారు. రూ.200 కోట్లతో చేపట్టిన కులగణన సర్వేతో రెండు కోట్ల మంది బడుగు బలహీన వర్గాలను అవమానించారు. డిప్యూటీ సీఎం భట్టి మాటలతో ప్రభుత్వ వైఫల్యం తేటతెల్లమయ్యిందన్నారు.