NLG: చిట్యాల మండలం ఏపూరులో మహిళలు, గ్రామస్థులు మద్య అమ్మకాలు నిషేధించాలని ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు, మహిళలు తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రయిస్తే రూ.లక్ష, తాగితే రూ.20వేలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు.