ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో బుధవారం ఆదివాసీ పురోహిత్ ప్రధాన్ సమాజ్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్మగురు హీరాసుక జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్ హాజరయ్యారు. అనంతరం తమ సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, ఆదివాసీలు తదితరులున్నారు.