ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తారని ముందే ప్రకటించారు. అనూహ్యంగా ఈ సినిమా వెనక్కి జరిగింది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నాడు.
హిందూ సంప్రదాయంలో శ్రీరామనవమి (Sri Rama Navami) అత్యంత పవిత్రమైన రోజు. ఈ పర్వదినం నాడు అన్ని రామాలయాలు, ఆంజనేయ ఆలయాల్లో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి. గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రేక్షకులు, ప్రభాస్ (Prabhas) అభిమానులకు అదిరిపోయే కానుక లభించింది. రాముడి (Ramudu) పాత్రలో ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమాలో నటిస్తున్న ప్రభాస్ పోస్టర్ ను యూవీ క్రియేషన్స్ (UV Creations) విడుదల చేసింది. ‘మంత్రం కన్నా నీ నామం గొప్పది జై శ్రీరామ్’ అంటూ పోస్టర్ విడుదలైంది.
బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్. రామాయణం ఇతివృత్తంగా ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆది పురుష్’. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతి సనన్ (Kriti Sanon) నటిస్తోంది. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) పోఫిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీత లక్ష్మణ ఆంజనేయ సమేత ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ ఉమ్మడిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. విజువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తారని ముందే ప్రకటించారు. అనూహ్యంగా ఈ సినిమా వెనక్కి జరిగింది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో అమితాసక్తిని పెంచేసింది. ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. దీనికోసం ఏకంగా రూ.100 నుంచి రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత అంతటి ఆశలు ప్రభాస్ ఈ సినిమాపై పెంచుకున్నాడు.