»Duronto Express Hits To Bolero Vehicle In Eluru District
Duranto Express అచ్చం సినిమాలోలాగా.. దురంతో రైలుకు ప్రమాదం
మరో ఇంజన్ అమర్చి అనంతరం యథావిధిగా రైలు బయల్దేరింది. కాగా బొలెరో వాహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేటు వేసినా దూసుకురావడంతో వాహనంలోని వ్యక్తులు దొంగలా? (Theif) అనే సందేహాలు వస్తున్నాయి. పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా అనే కోణంలో రైల్వే పోలీసులు (Railway Police) దర్యాప్తు చేస్తున్నారు.
అచ్చం సినిమాలో మాదిరి సంఘటన చోటుచేసుకుంది. రైల్వే గేటు (Railway Gate) పడి ఉంటే దాన్ని ఢీకొట్టి ముందుకు వెళ్లాలని కొందరు ప్రయత్నించారు. కానీ రైలు (Train) దూసుకురావడంతో వెంటనే వాహనం వదిలి పారిపోయారు. పట్టాలపై నిలిపిన వాహనం రైలు ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటన కారణంగా ఐదు గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. ఈ సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో (Eluru District) చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖపట్టణానికి (Visakhapatnam) బుధవారం రాత్రి దురంతో ఎక్స్ ప్రెస్ (Duronto Express) బయల్దేరింది. ఏపీలోని ఏలూరు జిల్లా భీమడోలుకు (Bhimadole) గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైలు చేరుకుంటోంది. రైలు వస్తున్న సందర్భంగా భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అయితే అదే సమయంలో ఓ బొలెరో వాహనం (Bolero) వచ్చింది. రైల్వే గేటు తీయాలని కోరారు. తీయకపోవడంతో వాహనంతో రైల్వే గేటును ఢీకొట్టి (Hit) ముందుకు కదిలారు. ఆలోపే దురంతో ఎక్స్ ప్రెస్ దూసుకురావడంతో వాహనంలోని వారు బొలెరోను పట్టాలపైనే వదిలేసి వెళ్లిపోయారు. రైలు ఢీకొనడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనతో రైలు ఇంజన్ (Rail Engine) దెబ్బతిన్నది.
ఈ ఘటనతో దురంతో ఎక్స్ ప్రెస్ దాదాపు ఐదు గంటలు నిలిచిపోయింది. మరో ఇంజన్ అమర్చి అనంతరం యథావిధిగా రైలు బయల్దేరింది. కాగా బొలెరో వాహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేటు వేసినా దూసుకురావడంతో వాహనంలోని వ్యక్తులు దొంగలా? (Theif) అనే సందేహాలు వస్తున్నాయి. పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా అనే కోణంలో రైల్వే పోలీసులు (Railway Police) దర్యాప్తు చేస్తున్నారు. వాహనం వివరాలు సేకరించి.. నిందితుల వివరాలు ఆరా తీస్తున్నారు.