WGL: అజంజాహీ కార్మికుల భవన స్థలాన్ని కాపాడాలని, కబ్జాకోరులకు సహకరించిన మునిసిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని MLC బసవరాజు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అజంజాహీ మిల్ స్థలం ముమ్మాటికీ కార్మికులదే అని, జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసని, కానీ తప్పుడు పత్రాలు సృష్టించి, భవనం కూల్చారన్నారు.