NRML: ఖానాపూర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారనీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పడాల లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ రాచమల్ల రాజశేఖర్ అన్నారు. రిపబ్లిక్ అవార్డులు పొందిన అవార్డు గ్రహీతలను బుధవారం సాయంత్రం ఖానాపూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు పాల్గొన్నారు.