NZB: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. కేశవ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఈనెల 20వ తేదీ సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. 21న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావల్సి ఉంటుందని వెల్లడించారు.