KMM: రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని, మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని ఛైర్మన్ ఐలూరు కృష్ణారెడ్డి సూచించారు. వైరా మండలం గరికపాడు PACS సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏవో, ఏఈవో, సీఈవో అంజయ్యతో పాటు సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.