ప్రముఖ కవి అందెశ్రీ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు అని మోదీ అభిప్రాయపడ్డారు. అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.