BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం అందెశ్రీ మృతి పట్ల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ కవి అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు.