KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కూసుమంచి మండలం కొత్తూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు ఇవాళ ప్రారంభించారు. అనంతరం కొత్తూరు, ఎర్రగడ్డ, దుబ్బ తండా రైతుల కోసం ఐకేపీ ఇంఛార్జ్ శ్రీను రాములు నాయక్, రామ్ కుమార్ నాయక్ ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు.