కృష్ణా: SFI గుడివాడ మండల మహాసభను సుందరయ్య భవనంలో సోమవారం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యా రంగంలో అనేక సమస్యలు కొనసాగుతున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కింద ₹6,484 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.