NLG: చింతపల్లి మండలం వెంకటంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ చారి ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గోవర్ధన్ చారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.