»Madhya Pradesh Discom Staffers Suspended Over Viral Video Showing This
Viral Video: మహిళ పట్ల అనుచిత ప్రవర్తన, సిబ్బంది సస్పెండ్
కరెంట్ బిల్లు కట్టలేదని ఓ వృద్ధ మహిళను వేధించిన డిస్కమ్ స్టాఫర్స్ ను సస్పెండ్ (staffers of a power distribution company were suspended) చేశారు. బిల్లు వసూలు (Power Bill) చేసేందుకు పద్ధతి ఉంటుంది.
కరెంట్ బిల్లు కట్టలేదని ఓ వృద్ధ మహిళను వేధించిన డిస్కమ్ స్టాఫర్స్ ను సస్పెండ్ (staffers of a power distribution company were suspended) చేశారు. బిల్లు వసూలు (Power Bill) చేసేందుకు పద్ధతి ఉంటుంది. కానీ వారు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో వెంటనే చర్యలు చేపట్టారు. మధ్య ప్రదేశ్ లో (Madhya Pradesh బీజేపీ ప్రభుత్వం (BJP Government) అధికారంలో ఉంది. ఈ వీడియోను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ (Congress) ప్రయత్నాలు చేసింది. ఈ సంఘటను కాంగ్రెస్ పార్టీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ (Congress MP Digvijay Singh), కేంద్ర మాజీ మంత్రి అరుణ్ యాదవ్ లు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించారు. కానీ ఇక్కడి ప్రభుత్వం వారిపై వెంటనే చర్యలు చేపట్టింది. ఈ సంఘటన శనివారం రోజు జరిగింది. ఓ వృద్ధ మహిళ అర్ధ నగ్న స్థితిలో ఉంది. ఆమె డిస్కమ్ అధికారుల వెంట పడుతున్నట్లుగా ఉంది. అయితే తన గుడిసెలోని వస్తువులను వారు బలవంతంగా తీసుకెళ్లి, వాహనంలో లోడ్ చేస్తుండటంతో ఆమె వారిని వెంబడించింది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ ఘటన సాగర్ జిల్లాలో జరిగింది. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఇటీవల అధికారి ఒకరు తెలిపారు. అధికారిక ప్రకటన ప్రకారం అగౌరవంగా, అనుచితగా ప్రవర్తించినందుకు, రూల్ బుక్ పాటించనందుకు డియోరిలో ఉన్న ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి చెందిన ఇద్దరు లైన్ అటెండెంట్స్ ను (కేటగిరీ 2)ను సస్పెండ్ చేసినట్లు సాగర్ కలెక్టర్ దీపక్ ఆర్య (Sagar collector) తెలిపారు. వీరితో పాటు డిస్కమ్ లోని మరో ఇద్దరు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించారు. కాంట్రాక్ట్ కార్మికుల్లో ఒకరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
బీజేపీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిలదీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు విద్యుత్ సంస్థ సిబ్బంది ఆమె వద్దకు చేరుకున్నప్పుడు వృద్ధురాలు స్నానం చేసే వరకు కూడా ఆగకుండా ఇబ్బంది పెట్టారని పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నది. మహిళను బహిరంగంగా అవమానించారని, ఆమె ఇంటి నుండి వస్తువులను బలవంతంగా తీసుకు వెళ్లారని పేర్కొన్నది. విద్యుత్ పంపిణీ సంస్థ.. డిఫాల్టర్ల నుండి కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్న తీరు అమానవీయంగా ఉందని డిగ్గీ రాజా పేర్కొన్నారు. అయితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవడం గమనార్హం.
शिव’राज की बेशर्मी देखिये, — बिजली बिल वसूली के लिये बुजुर्ग महिला को नहाने तक नहीं दिया, सरेआम बेइज़्ज़त किया, घर का सारा सामान ले गये।