Rahul gandhi: ఇల్లు ఖాళీ చేయాలని రాహుల్ కు నోటీసులు
రాహుల్ గాంధీ(Rahul gandhi)పై ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా ఢిల్లీలోని లుటియన్స్ అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్సభ హౌసింగ్ కమిటీ కోరింది. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ కమిటీ సోమవారం రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul gandhi)కి మరో షాకింగ్ న్యూస్ తగిలింది. అది ఏంటంటే ఢిల్లీలోని తుగ్లక్ లేన్ 12లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్సభ హౌసింగ్ కమిటీ కోరింది. నియమం ప్రకారం అనర్హుడైన పార్లమెంట్ సభ్యుడు ప్రభుత్వ వసతికి అర్హులు కాదు. అంతేకాదు అధికారిక బంగ్లాను 30 రోజుల వ్యవధిలోపు ఖాళీ చేయాల్సి ఉంటుంది. లోక్సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన కొద్ది రోజుల తర్వాత ఈ మేరకు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు.
2004లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి తొలిసారిగా ఎన్నికైన రాహుల్ గాంధీ లోక్సభ ఎంపీగా ఇది నాలుగోసారి. 2019లో అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినా కూడా కేరళలోని వాయనాడ్ స్థానం నుంచి గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూరత్ కోర్టు (Surat Court) భారీ షాక్ ఇచ్చింది. ఓ పరువు నష్టం (Defamation case against Rahul Gandhi) దావా కేసులో అతనిని దోషిగా (Rahul Gandhi Convicted) తేల్చిన న్యాయస్థానం, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. మోడీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే (Modi surname) అని 2019లో ఆయన కర్నాటకలో ఓ సభలో వ్యాఖ్యానించారు.
దీని పైన గుజరాత్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పుర్నేష్ మోడీ కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడి పైన పరువు నష్టం దావా (criminal defamation case filed against Rahul Gandhi) వేసారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 504 కింద రెండేళ్ల జైలు శిక్షను వేసింది. ఈ సెక్షన్ కింద గరిష్ట శిక్ష రెండేళ్లు ఉంటుంది.