»Again Interesting Comments By Health Director Gadala Srinivas
DH : మరోసారి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ (Telanagana) హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ (Gadala Srinivas) మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిద్ధిపేటకు అనేకసార్లు వెళ్లానని అక్కడ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. విద్యా, వైద్యం, ఆహ్లాదం ఇలా అన్ని రంగాల్లో సిద్ధిపేటను ముందుంచారని చెప్పారు. అభివృద్ధిలో కొత్తగూడెం (Kothagudem) మరో సిద్ధిపేటలా కావాలని ఆక్షించారు. ఈ క్రమంలో ఇటీవల అక్కడ పర్యటించిన ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ (Telanagana) హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ (Gadala Srinivas) మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిద్ధిపేటకు అనేకసార్లు వెళ్లానని అక్కడ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. విద్యా, వైద్యం, ఆహ్లాదం ఇలా అన్ని రంగాల్లో సిద్ధిపేటను ముందుంచారని చెప్పారు. అభివృద్ధిలో కొత్తగూడెం (Kothagudem) మరో సిద్ధిపేటలా కావాలని ఆక్షించారు. ఈ క్రమంలో ఇటీవల అక్కడ పర్యటించిన ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఎవరైనా ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యే ఉన్నారంటే అది మంత్రి హరీష్ రావు అన్నారు.ప్రభుత్వ అధికారిగా ఉన్న గడల కొంత కాలం నుంచి జీఎస్ఆర్ ఫౌండేషన్ (GSR Foundation) స్దాపించి సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నారు. హరీశ్ రావు సిద్దిపేటకు చేసిన దాంట్లో 50 శాతం పనులు చేసినా కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఉద్యోగరీత్యా తాను సిద్ధిపేటకు అనేకసార్లు వెళ్లానని అక్కడ హరీష్ రావు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. విద్యా, వైద్యం, ఆహ్లాదం ఇలా అన్ని రంగాల్లో సిద్ధిపేటను ముందుంచారని చెప్పారు. అభివృద్ధిలో కొత్తగూడెం మరో సిద్ధిపేటలా(Siddipet) కావాలని ఆక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇటీవల క్రిస్మస్(Christmas) సందర్భంగా కరోనాపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏసు క్రీస్తు (Jesus Christ) కృపతోనే కరోనా కట్టడి సాధ్యమైందని.. క్రిస్టియన్స్ వల్లే భారత్ అభివృద్ధి చెందిందంటూ చేసిన వాఖ్యలపై పెద్దఎ్తతున్న విమర్శలు వచ్చాయి. అంతకు ముందు సీఎం కేసీఆర్ (CM KCR) కాళ్లు మొక్కటం కూడా చర్చనీయాంశమైంది. దీంతో.. ప్రతిపక్షాలు పెద్దఎత్తున డీహెచ్ శ్రీనివాస్‌పై విమర్శలు గుప్పించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ (MLA ticket) కోసమే ఇదంతా చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా చేశారు. వాళ్లు చేసిన అన్ని విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు డీహెచ్ శ్రీనివాస్.