VZM: ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించే నెల్లిమర్ల నగర పంచాయతీ సాధారణ కౌన్సిల్ సమావేశంలో 20 వార్డులకు చెందిన కౌన్సిలర్లు, అన్ని విభాగాల అధికారులు పాల్గొనాలని కమిషనర్ కె.అప్పలరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ఛైర్ పర్సన్ బంగారు సరోజిని అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు.