NRML: ఖానాపూర్ మండలంలోని ఏర్వచింతల్ గ్రామంలో నిర్మించిన మున్నూరుకాపు సంఘం భవనాన్ని ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంఘం భవనాన్ని కల్యాణ మండపంగా నిర్మించి పేద ప్రజలకు సౌకర్యం కల్పించడం పట్ల సంఘం సభ్యులను అభినందించారు. భవనాన్ని ప్రజలు వినియోగించాలని సూచించారు.