కోనసీమ: మండపేట పట్టణంలో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొమ్మిశెట్టి వెంకటేష్ కుటుంబానికి 5లక్షల రూపాయల భీమా చెక్కును రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ PAC ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆదివారం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. పిల్లల చదువుల బాధ్యతను పార్టీ చూస్తుందని భరోసా ఇచ్చారు.