»Mla Rapaka Vara Prasad Sensational Comments On Sarpanch Elections With Stolen Votes
MLA Rapaka vara prasad: దొంగ ఓట్లతోనే గెలిచా
ఏపీలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్(Rapaka vara prasad) మరోసారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారిపోయాయి. తాను గతంలో సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని వ్యాఖ్యానించారు. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు పడేవన్నారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని రాజోలు ఎమ్మెల్యే(MLA)రాపాక వరప్రసాద్(Rapaka vara prasad) మరోసారి సంచలన కామెంట్లు(comments) చేశారు. అసలు తాను దొంగ ఓట్లతోనే గెలిచానని చెప్పుకొచ్చారు. అంతేకాదు అంతకుముందు కూడా ఓసారి సర్పంచ్ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే గెలిచినట్లు వెల్లడించారు. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు పడేవన్నారు. తన అనుచరులే ప్రతి ఒక్కరు దాదాపు 10కిపైగా ఓట్లు వేసేవారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ క్రమంలో చింతలమోరిలో తనకు మెజారిటీ ఏడు నుంచి ఎనిమిది వందల వరకు వచ్చేదంటూ.. ఏదో గొప్ప కార్యం అయినట్టుగా చెప్పుకొచ్చారు. ఇటీవల రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో భాగంగా రాపాక వరప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి. గతంలో చింతలమూరి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు రాపాక. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన వీడియో వైరల్ గా మారింది. మరోవైపు దొంగ ఓట్లతోనే తాను గెలిచానంటూ ఆయన పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, ఇటీవల వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాపాక ఉత్సాహంతో మాట్లాడారు. అదే సమయంలో రాపాక నోరుజారినట్లు తెలుస్తోంది.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే బేరసారాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి ఓటు వేయాలని.. టీడీపీ నేతలు తన మిత్రుడిని సంప్రదించారని వివరించారు. అలా వేస్తే రూ.10 కోట్లు (10 crores) ఇచ్చే వారని పేర్కొన్నారు. రాజోలులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తన మిత్రుడు కేఎస్ఎన్ రాజుతో (ksn raju) టీడీపీ నేతలు బేరం ఆడారని వివరించారు. అసెంబ్లీ వద్ద కూడా ఒక రాజు తనతో బేరాలకు దిగారని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని తెలిపారు. కానీ అందుకు అంగీకరించలేదని చెప్పారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమని చెప్పారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ.10 కోట్లు (10 crores) వచ్చేవని తెలిపారు. తాను సీఎం జగన్‌ను (jagan) విశ్వసించానని స్పష్టంచేశారు. టీడీపీ ఆఫర్ తిరస్కరించానని ఆయన వెల్లడించారు.