»It Should Be Like This Sisters Wedding Rs 8 Crores Gift All Records Are Lost Due To Blow
Viral News : చెల్లిమీద ఎంత ప్రేమ…. కట్నంగా రూ.8కోట్లు ఇచ్చిన సోదరులు..!
Viral News : ఈరోజుల్లో దాదాపు అందరూ ఆస్తి కోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధం కన్నా....కూడా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న రోజులవి. అలాంటిది... ఈ అన్నలు మాత్రం అలా కాదు. చెల్లి పెళ్లి ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు.
ఈరోజుల్లో దాదాపు అందరూ ఆస్తి కోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధం కన్నా….కూడా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న రోజులవి. అలాంటిది… ఈ అన్నలు మాత్రం అలా కాదు. చెల్లి పెళ్లి ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని ధింగ్సార గ్రామానికి చెందిన అర్జున్ రామ్ మెహారియా, భగీరథ్ మెహారియాలు కలిసి తన సోదరికి వివాహాం జరిపించారు.
దీనిలో భాగంగా వీరు తమ చెల్లికి కానుకగా దాదాపు రూ.8.1 కోట్ల విలువ చేసే ఆస్తులను కానుకగా అందించారు. ఇలా పెళ్లి వేడుకకు కట్న కానుకలు సమర్పించడాన్ని మైరా అంటారు. ఈ సోదరులు తమ సోదరికి మైరాలో రూ.2.21 కోట్ల నగదుతో పాటు, 1.105 కేజీల బంగారం, 14 కేజీల వెండి ఉన్నాయి.
అంతేకాకుండా రూ.4.42 కోట్లు విలువ చేసే భూమిని కానుకగా అందించారు. అవే కాకుండా ఆ సోదరులు తన సోదరి కోసం ఓ ట్రాక్టర్ గోధుమలు, స్కూటీతో పాటు మరి కొన్ని వాహనాలు, నగలను కట్నంగా సమర్పించారు. ఈ ఆచారం తమ కుటుంబంలో ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుందని ఆ సోదరులు చెప్పారు.