Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఓ 19 ఏళ్ల కుర్రాడు తన మైనర్ సోదర్ని రేప్ చేసి హత్య చేశాడు. సంజూ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూశాడు. ఆ తర్వాత తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సోదరి ఈ విషయాన్ని ఇంట్లో చెబుతుందన్న భయంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలించి.. తర్వాత అదుపులోకి తీసుకున్నారు. సంజూ తండ్రి ఏడాది క్రితమే మరణించాడు. తల్లి, సోదరితో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఓరోజు తల్లి బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న చెల్లిపై ఆ సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మొబైల్లో పోర్న్ చూసి.. చెల్లిని రేప్ చేసి హతమార్చాడు.